sensex: వరుస లాభాల తర్వాత నష్టాల్లోకి జారుకున్న దేశీయ మార్కెట్లు

  • రెండు రోజుల జోరుకు బ్రేక్
  • 174 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 11,691 పాయింట్లకు జారిపోయిన నిఫ్టీ

గత రెండు సెషన్లలో మంచి జోరును కొనసాగించిన దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియాలాంటి దిగ్గజాలు నష్టాలను మూటగట్టుకోవడంతో... మార్కెట్ల జోరుకు నేడు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 174 పాయింట్లు కోల్పోయి 38,722కు పడిపోయింది. నిఫ్టీ 47 పాయింట్లు పతనమై 11,691కు జారుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (12.15%), హెచ్డీఐఎల్ (9.74%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (8.97%), ఫ్యూచర్ కన్జ్యూమర్ లిమిటెడ్ (8.90%), టీటీకే ప్రిస్టేజ్ (7.08%).

టాప్ లూజర్స్:
ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (-5.52%), క్వాలిటీ (-4.99%), పీ అండ్ జీ హైజీన్ అండ్ హెల్త్ కేర్ లిమిటెడ్ (-4.41%), ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ (-4.36%), డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ లిమిటెడ్ (-3.65%). 

More Telugu News