koko kokila: డ్రగ్స్ స్మగ్లర్ గా నయనతార.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సినిమా!

  • అదరగొడుతున్న ‘కొలమావు కోకిల’
  • ఇప్పటికే తమిళంలో భారీ వసూళ్లు
  • తెలుగులో 31న రిలీజ్ కు సన్నాహాలు

ప్రముఖ నటి నయనతార తమిళంలో నటించిన ‘కొలమావు కోకిల’ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఈ నెల 17న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో దీన్ని తెలుగులోనూ విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. శుక్రవారం తెలుగులో ‘కోకో కోకిల’ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది.

కాగా, నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ.20 కోట్లు కొల్లగొట్టిందట! కుటుంబం సమస్యలను పరిష్కరించడానికి డ్రగ్ స్మగ్లింగ్ కు దిగే యువతి పాత్రలో నయన్ నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ విషయాన్ని కొలమావు కోకిల చిత్ర యూనిట్ తెలిపింది. గతంలో ఈ సినిమాను థియేటర్లలో చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ లు నటీనటులతో పాటు చిత్ర యూనిట్ ను అభినందించారు.

More Telugu News