NDA: జమిలి ఎన్నికలకు కేంద్రం కసరత్తు..పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు!: బీజేపీ నేత కృష్ణసాగర్‌ రావు

  • జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగాన్ని సవరించనున్న కేంద్రం!
  • శీతాకాల సమావేశాల్లో బిల్లు
  • వెల్లడించిన అధికార ప్రతినిధి కృష్ణ సాగర్

లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న కేంద్రం అందుకు తగ్గ ఏర్పాట్లలో తలమునకలైనట్టు తెలుస్తోంది. రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. అయితే, శీతాకాల సమావేశాల్లో, లేదంటే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరిచిగానీ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్టు ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్‌ రావు తెలిపారు. జమిలి ఎన్నికలకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం ఫలించకపోవచ్చని కృష్ణ సాగర్ రావు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం ద్వారా మరోమారు అధికారంలోకి రావచ్చని కేసీఆర్ భావిస్తుండొచ్చని తెలిపారు. దీనికితోడు మోదీ అద్భుత పరిపాలన ప్రభావం తెలంగాణపై ఉంటుందన్న భయం కూడా కేసీఆర్‌కు ఉండొచ్చని, అందుకే ముందస్తు గానం అందుకున్నారన్నారు.

More Telugu News