Pooja: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • డబ్బింగ్ చెప్పనున్న మరో నాయిక
  • పూరి జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ!
  • మరో చిత్రంలో హీరోగా షకలక శంకర్

*  అందాలభామ పూజా హెగ్డే కూడా త్వరలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనుంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అరవింద సమేత' చిత్రానికి పూజ డబ్బింగ్ చెప్పనుంది. కాగా, ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.
*  తాజాగా విడుదలైన 'గీత గోవిందం' చిత్రంతో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయిన విజయ్ దేవరకొండ త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
*  'జబర్దస్త్' ఫేం షకలక శంకర్ హీరోగా మరో చిత్రాన్ని చేయనున్నాడు. 'శంభో శంకర' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన శంకర్ ప్రస్తుతం 'డ్రైవర్ రాముడు', 'కేడీ నెం 1'  చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. ఈ క్రమంలో తన నాలుగో చిత్రాన్ని కూడా అంగీకరించాడు.

More Telugu News