Kerala flodds: పది రోజుల్లో రూ.500 కోట్లు తాగేసిన కేరళ మందుబాబులు.. వరదల్లోనూ తగ్గని జోరు!

  • మద్యం విక్రయాల్లో కేరళలో సరికొత్త చరిత్ర
  • ఆగస్టు 15 నుంచి ఓనమ్ వరకు వందల కోట్ల విక్రయాలు
  • సోషల్ మీడియాలో జోకులు

కేరళ విలయం మందుబాబులను ఏమాత్రం మార్చలేకపోయింది. వరదల కారణంగా రాష్ట్రం అతలాకుతలమైనా, అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డా మందువీరులు మాత్రం వెనక్కి తగ్గలేదు. వరదల నుంచి కాస్త తెరపిన పడగానే వందలకోట్ల విలువైన మద్యాన్ని గటగటా తాగేశారు. ఏకంగా రూ.500 కోట్ల మద్యాన్ని పొట్టలో పోసేసుకున్నారు. అది కూడా పది రోజుల వ్యవధిలోనే. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర బేవరెజెస్ కార్పొరేషన్ (బీఈవీసీవో) వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి ఓనమ్ పండుగ జరుపుకున్న 26వ తేదీ మధ్య ఏకంగా రూ.516 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు వివరించింది.

కేరళీయులు పది రోజుల్లో రూ.500 కోట్ల మద్యాన్ని తాగడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. వరదల్లో సర్వం పోగొట్టుకున్న ప్రజలు ఆ బాధను మర్చిపోయేందుకు మద్యాన్ని ఆశ్రయించారని కొందరంటే.. చలి బారి నుంచి తప్పించుకునేందుకు తాగారంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి వరదల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను ఇలా ఇచ్చారంటూ కామెంట్ చేస్తున్నారు.

More Telugu News