Nagarjuna: కింగ్ నాగార్జునకు 'హ్యాపీ బర్త్ డే' చెబుతూ ‘దేవదాస్’ స్టిల్స్ విడుదల

  • చైర్ లో కూర్చుని నవ్వుతున్న ఓ స్టిల్
  • లాంగ్ కోట్, హ్యాట్ ధరించిన మరో స్టిల్
  • స్టిల్స్ లో అదిరిపోయిన నాగ్

నాగార్జున, నాని నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’. రేపు నాగార్జున బర్త్ డే ను పురస్కరించుకుని ‘దేవదాస్’ స్టిల్స్ ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. ఈ స్టిల్స్ లో నాగార్జున చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. చైర్ లో కూర్చుని నవ్వుతున్న స్టిల్ ఒకటి కాగా, లాంగ్ కోట్, హ్యాట్ ధరించి ఓ స్తంభానికి ఆనుకుని ఉన్న మరో స్టిల్ లో నాగార్జున అదిరిపోయాడు. కాగా, శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా రష్మిక, ఆకాంక్ష సింగ్ నటిస్తున్నారు. వచ్చే నెల 27న ‘దేవదాస్’ విడుదల కానుంది.

More Telugu News