sensex: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 202 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 11,738 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
  • జోరును కొనసాగిస్తున్న దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంచి లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 202 పాయింట్లు లాభపడి 38,897కి చేరింది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 11,738 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ (19.99%), అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ (15.65%), రెడింగ్టన్ ఇండియా (9.83%), ఫైజర్ (9.10%), అదానీ ఎంటర్ ప్రైజెస్ (8.27%).  
   
టాప్ లూజర్స్:
క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ (-6.04%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-5.85%), గెయిల్ ఇండియా (-5.43%), డీబీ కార్ప్ (-5.40%), పీసీ జువెలర్స్ (-5.11%). 

More Telugu News