KCR: కేసీఆర్ ను కలిసిన బీజేపీ నేతలు.. వాజ్ పేయి విగ్రహ ప్రతిష్ఠకు స్థలం ఇవ్వాలని విజ్ఞప్తి!

  • క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్న నేతలు
  • విగ్రహంతో పాటు స్మృతి వనం ఏర్పాటుపై చర్చ
  • ఢిల్లీ టూర్ తర్వాత కేసీఆర్ తొలి అపాయింట్ మెంట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ రోజు సాయంత్రం రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయి స్మృతి వనం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలి ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవ్వరికీ అపాయింట్ మెంట్ ఇవ్వని సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలుసుకున్న బీజేపీ నేతలు వాజ్ పేయి విగ్రహంతో పాటు స్మృతి వనం ఏర్పాటుకు హైదరాబాద్ లో స్థలం కేటాయించాలని కోరారు.

ఢిల్లీ పర్యటన తర్వాత ఏ నాయకుడికి అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ బీజేపీ నేతలను కలుసుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీగా సహకరించుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News