nikhil: నిఖిల్ హీరోగా సాయి కొర్రపాటి మూవీ

  • నిఖిల్ హీరోగా 'ముద్ర'
  • నెక్స్ట్ మూవీ దర్శకుడిగా అవసరాల
  • త్వరలోనే సెట్స్ పైకి    

నిఖిల్ హీరోగా 'ముద్ర' సినిమా రూపొందుతోంది. తమిళంలో హిట్ కొట్టిన 'కనితన్' సినిమాకి ఇది రీమేక్. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనుంది. ఈ సినిమా తరువాత ఆయన వారాహి చలనచిత్ర బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు.

సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. 'ముద్ర' సినిమాను పూర్తి చేసి, ఆ వెంటనే అవసరాలతో కలిసి నిఖిల్ సెట్స్ పైకి వెళ్లనున్నాడని చెబుతున్నారు. ముందుగా ఈ సినిమాను నాగచైతన్యతో చేయాలనుకున్నారట. కానీ ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన నిఖిల్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.   

More Telugu News