Uttarakhand: చెట్లను నరికించిన డీజీపీ.. భారీ జరిమానాతో చుక్కలు చూపించిన ఎన్జీటీ!

  • రిజర్వ్ ఫారెస్ట్ లో డీజీపీ భూమి కొనుగోలు
  • అనంతరం చెట్లను నరికించిన అధికారి
  • మొట్టికాయలు వేసిన హరిత ట్రైబ్యునల్

ఉత్తరాఖండ్ మాజీ డీజీపీకి జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ రోజు షాకిచ్చింది. అక్రమంగా ఆటవీ ప్రాంతంలో భూమిని కొనుగోలు చేయడమే కాకుండా అనుమతులు లేకుండా భారీ వృక్షాలను నేల కూల్చినందుకు ఏకంగా రూ.46 లక్షల జరిమానా విధించింది. ఉత్తరాఖండ్ లో డీజీపీగా పనిచేస్తున్న సమయంలో బీఎస్ సిద్ధూ అనే ఐపీఎస్ అధికారి ముస్సోరీ రిజర్వ్ ఫారెస్ట్ లో భూమిని కొనుగోలు చేశారు.

అనంతరం అక్కడ ఉన్న 25 సాల్ చెట్లను అనుమతులు తీసుకోకుండా కూల్చేశారు. దీంతో ఈ ఘటనపై ఎన్జీటీ బార్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన ట్రైబ్యునల్ సాక్షాత్తూ ఐపీఎస్ అధికారి పర్యావరణ విధ్వంసానికి దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నేలకొరిగిన చెట్ల విలువకు 10 రెట్ల జరిమానా చెల్లించాలని ఈ రోజు తీర్పు ఇచ్చింది. జాతీయ అటవీ విధానం-1998, జాతీయ అడవుల పరిరక్షణ చట్టం-1980 ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో భూమి కొనుగోలు చేయడం నేరమని ట్రైబ్యునల్ తేల్చిచెప్పింది.

More Telugu News