stalin: దేశం బాగుపడాలంటే.. మోదీని వెంటనే దించేయాలి: డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ తొలి ప్రసంగం

  • మతాల పేరుతో ప్రజలను బీజేపీ విడదీస్తోంది
  • అన్నాడీఎంకే నేతలకు ఎప్పుడూ పదవుల కుమ్ములాటలే
  • నేను పాత స్టాలిన్ ను కాదు.. సరికొత్త స్టాలిన్ ను

డీఎంకే అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన స్టాలిన్... అధ్యక్ష హోదాలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, అన్నాడీఎంకేలపై ఆయన విరుచుకుపడ్డారు. దేశంలో బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని... మత ప్రాతిపదికన ప్రజలను విడదీసేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. దేశంలో జరుగుతున్న దారుణాలను అరికట్టాలంటే మోదీని ప్రధాని పదవి నుంచి వెంటనే దించేయాలని పిలుపునిచ్చారు. అన్నాడీఎంకే ప్రజల కోసం పని చేయడం లేదని... వారికెప్పుడూ పదవుల కుమ్ములాటలే తప్ప, ప్రజల శ్రేయస్సు పట్టదని అన్నారు.

కరుణానిధి మన మధ్య లేకపోయినా... ఆయన ఆశీస్సులు ఎప్పటికీ మనతోనే ఉంటాయని స్టాలిన్ తెలిపారు. కరుణ ఆశయాలను డీఎంకే అధినేతగా తాను ముందుకు తీసుకెళతానని చెప్పారు. తాను ఇప్పుడు పాత స్టాలిన్ ను కాదని... సరికొత్త స్టాలిన్ ను అని తెలిపారు. 

More Telugu News