vijay devarakonda: 'టాక్సీవాలా'పై అవన్నీ పుకార్లేనట!

  • విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా'
  • కథానాయికలుగా మాళవిక .. ప్రియాంక 
  • గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఆలస్యం  

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'టాక్సీవాలా' చిత్రం రూపొందింది. మాళవిక నాయర్ .. ప్రియాంక జవాల్కర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ ఉండటంతో, కొన్ని సీన్స్ అనుకున్నట్టుగా రాకపోవడంతో రీ షూట్లు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది.

తాజాగా ఈ విషయాన్ని గురించి దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ స్పందించాడు. ఈ సినిమాకి సంబంధించిన సింగిల్ షాట్ ను కూడా రీ షూట్ చేయడం లేదని చెప్పాడు. రీ షూట్లు చేస్తున్నారంటూ షికారు చేస్తోన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని అన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కారణంగా మాత్రమే ఆలస్యం అవుతుందని చెప్పాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ తాము అనుకున్నట్టుగానే చాలా బాగా వచ్చిందనీ, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశాడు.   

More Telugu News