ఎన్టీఆర్ అంటే గౌరవం వుండేది .. భయం ఉండేది కాదు: జయసుధ

- చిన్నప్పటి నుంచి నాకు ధైర్యం ఎక్కువే
- 'ఎదురీత'లో రెండవ హీరోయిన్ గా చేశాను
- 'అడవిరాముడు' నుంచి వరుసగా చేశాను
అందుకు జయసుధ స్పందిస్తూ .. "ఎన్టీ రామారావుగారితో కలిసి 'ఎదురీత' సినిమాలో చేశాను .. ఆ సినిమాలో ఫస్టు హీరోయిన్ వాణిశ్రీ గారు .. నేను రెండవ హీరోయిన్. 'అడవిరాముడు' నుంచి ఇక వరుస సినిమాలు చేస్తూ వెళ్లాను. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ధైర్యం ఎక్కువే. అందువలన రామారావుగారితో కలిసి నటిస్తున్నప్పుడు ఆయన అంటే గౌరవం ఉండేది గానీ .. భయం ఉండేది కాదు. రామారావుగారు సెట్ కి రాగానే మిగతా వాళ్లు ఎలా ఉండాలి .. ఎలా నడుచుకోవాలి? అనే విషయాన్ని మాకు ముందుగానే సీనియర్స్ చెప్పేవారు .. అలాగే ఉండేవాళ్లం" అని చెప్పుకొచ్చారు.