Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'యూ టర్న్' రిలీజ్ డేట్ ప్రకటించిన సమంత 
  • సూపర్ స్టార్ కృష్ణగా సుధీర్ బాబు?
  • 'ట్యాక్సీవాలా' రీ షూట్ రూమర్లు 
  • 'సిల్లీ ఫెలోస్'ని తీసుకున్న ప్రముఖ నిర్మాత      

*  సమంత నటించిన 'యూ టర్న్' సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్ధం తొలగిపోయింది. ఈ సినిమా వాయిదాపడేలా ఉందన్న వార్తల నేపథ్యంలో సమంత తాజాగా ట్వీట్ చేస్తూ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలవుతుందని పేర్కొంది.
*  తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని సృష్టించుకున్న సూపర్ స్టార్ కృష్ణ జీవితంపై ఓ బయోపిక్ రానుంది. ఈ విషయాన్ని ఆయన అల్లుడు, హీరో సుధీర్ బాబు తెలిపాడు. ఈ చిత్రం గురించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇందులో కృష్ణ పాత్రను సుధీర్ బాబు పోషిస్తాడని తెలుస్తోంది.
*  విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న 'ట్యాక్సీవాలా' చిత్రాన్ని రీ షూట్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆ చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఖండించాడు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, సినిమా ఔట్ పుట్ పై అంతా హ్యాపీగా ఉన్నామని ట్వీట్ చేశాడు.
*  అల్లరి నరేశ్, సునీల్ హీరోలుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన 'సిల్లీ ఫెలోస్' చిత్రం వచ్చే నెల 7న విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం నైజాం హక్కులతో పాటు నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల హక్కులను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తీసుకున్నారు.

More Telugu News