hyderabad: హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు తీర్పును వాయిదా వేసిన ఎన్ఐఏ కోర్టు!

  • 2007 ఆగస్టు 25న గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో పేలుళ్లు
  • ఎనిమిది మందిని నిందితులుగా తేల్చిన కోర్టు
  • పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు

హైదరాబాదులో 11 ఏళ్ల క్రితం జరిగిన జంట పేలుళ్ల కేసు తీర్పును ఎన్ఐఏ కోర్టు వాయిదా వేసింది. వచ్చే నెల 4వ తేదీన తీర్పును వెలువరిస్తామని తెలిపింది. భద్రతా కారణాల రీత్యా గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల నిందితుల్లో ఐదుగురిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. అనంతరం తుది తీర్పును వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.

ఈ కేసులో రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, అనిక్ షఫీక్, ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీక్, మహ్మద్ షేక్, షఫ్రుద్దీన్, అమీర్ రిజాఖాన్లను కోర్టు నిందితులుగా తేల్చింది. ఇందులో ముగ్గురు పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురిపై విచారణ కొనసాగింది. 2007 ఆగస్టు 25న ఈ జంట పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో 44 మంది ప్రాణాలు కోల్పోగా, 68 మందికి గాయాలయ్యాయి.

More Telugu News