udayandhi: మరో ఛాన్స్ కొట్టేసిన కథానాయిక అదితీరావు

  • అదితీరావుకి తెలుగులోను క్రేజ్
  • త్వరలో విడుదల కానున్న 'నవాబ్'
  • ఉదయనిధి స్టాలిన్ జోడీగా అవకాశం      

'చెలియా' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదితీరావు, 'సమ్మోహనం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. త్వరలో 'నవాబ్' సినిమాతో పలకరించనుంది. ఈ సినిమాలో తన పాత్ర తనకి తెలుగు .. తమిళ భాషల్లో మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో వున్న అదితీరావు, తాజాగా మరో తమిళ సినిమాను అంగీకరించింది.

దర్శకుడు మిస్కిన్ తమిళంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా అదితీరావు అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించడం ... ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.     

More Telugu News