Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • డబ్బింగ్ చెబుతానంటున్న రష్మిక 
  • లొకేషన్ల వేటలో దర్శకుడు శంకర్
  • కేరళలో 'గీతగోవిందం' హవా

*  'గీత గోవిందం' చిత్రంతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కథానాయిక రష్మిక మందన త్వరలో సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం తాను నటిస్తున్న 'దేవదాస్' చిత్రానికి త్వరలో ఈ ముద్దుగుమ్మ డబ్బింగ్ చెబుతుందట.
*  కమలహాసన్ తో ప్రముఖ దర్శకుడు శంకర్ 'భారతీయుడు 2' రూపొందించడానికి గత కొంత కాలంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. డిసెంబర్ నుంచి షూటింగును ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం తన కెమెరామెన్ రవివర్మన్ తో కలసి లొకేషన్ల అన్వేషణ చేస్తున్నాడట.
*  విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' చిత్రం కలెక్షన్లలో దూసుకుపోతూ 100 కోట్ల క్లబ్బులో చేరనుంది. కాగా, ఇటీవల వరదలు వచ్చిన కేరళలో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అక్కడ ఈ చిత్రం తాజాగా రెండో వారంలోకి ఎంటర్ అయినట్టు, కలెక్షన్లు బాగున్నట్టు సమాచారం. 

More Telugu News