Venezula: ఖాళీ అవుతున్న వెనిజులా... లాటిన్ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వలస!

  • వెనిజులాలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం
  • ఇరుగు పొరుగు దేశాలకు ప్రజల వలస
  • 17, 18 తేదీల్లో సమావేశం కానున్న 13 దేశాలు

తీవ్రమైన ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిన వేళ, వెనిజులా ప్రజలు ఇరుగు పొరుగు దేశాలకు భారీగా వలస పోతున్నారు. తమ దేశపు కరెన్సీకి ఏ మాత్రం విలువ లేకపోవడం, ఆకాశానికి పెరిగిన ద్రవ్యోల్బణం, పరిస్థితి చక్కబడేలా ప్రభుత్వం తక్షణం ఏమీ చేయకపోవడంతో లక్షలాది మంది వలస పోతున్నారు.

దక్షిణ అమెరికాలో భాగంగా ఉన్న వెనిజులా, కొలంబియా, గుయానాల మధ్య ఉండగా, లక్షల సంఖ్యలో ప్రజలు ఈ దేశాలకు మూటా ముల్లే సర్దేస్తున్నారు. లాటిన్ అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద వలసని ఐక్యరాజ్యసమితి అభివర్ణించిందంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, వచ్చే నెల 17, 18 తేదీల్లో క్విటోలో సమావేశం కానున్న లాటిన్ అమెరికాలోని 13 దేశాలు, వెనిజులా పరిస్థితిని అంచనా వేయనున్నాయి. వెనిజులాలో ఆర్థిక మాంద్యం తొలగే దిశగా, ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం.

More Telugu News