Diviseema: ఆగని పాము కాట్లతో దివిసీమ వాసుల కీలక నిర్ణయం... 29న భారీ స్థాయిలో 'సర్పహోమం'!

  • వారం పది రోజులుగా పాము కాట్లకు గురవుతున్న దివిసీమ ప్రజలు
  • శాంతి కోసం సర్పహోమం తలపెట్టిన దివిసీమ వాసులు
  • పాములు శాంతిస్తాయని భావిస్తున్న ప్రజలు

గడచిన వారం పది రోజులుగా కృష్ణా జిల్లా దివిసీమలో విషసర్పాల కాటునకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో, ఇక్కడి ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రాంతంపై పాములు పగబట్టాయని నమ్ముతున్న వీరు, 29వ తేదీన భారీ స్థాయిలో సర్పహోమం నిర్వహించాలని నిర్ణయించారు. సర్పహోమం తరువాత పాములు శాంతిస్తాయని భావిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులూ పాల్గొంటారని ప్రజలు అంటున్నారు. కాగా, దివిసీమ ప్రాంతంలో ఇప్పటివరకూ సుమారు 80 మందికి పైగా పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే.

More Telugu News