chaitu: 'శైలజా రెడ్డి అల్లుడు' ఆ రోజున వస్తున్నాడు

  • మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్ 
  • వినాయక చవితికి విడుదల

మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రం రూపొందింది. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కేరళలో రీ రికార్డింగ్ చేస్తోన్న గోపీ సుందర్, వరదల కారణంగా సకాలంలో తన పనిని పూర్తిచేయలేకపోయాడు. దాంతో ఈ సినిమా ముందుగా అనుకున్నట్టుగా ఈ నెల 31వ తేదీన థియేటర్లకు రావడం లేదు.  'వినాయక చవితి' సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనేది తాజా సమాచారం. అదే రోజున 'యూ టర్న్' .. 'నన్నుదోచుకుందువటే' సినిమాలు విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. 

More Telugu News