Narendra Modi: మోదీ మళ్లీ ప్రధాని కావడం కల్లే: కాలమిస్టు రుచిర్ శర్మ

  • పడిపోతున్న మోదీ గ్రాఫ్
  • గతేడాది 99 శాతం అవకాశాలు
  • ప్రస్తుతం 50 శాతానికి పడిపోయిన వైనం

వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి ఎదురుదెబ్బ తప్పదా? అంటే, అవుననే అంటున్నారు ప్రఖ్యాత కాలమిస్టు రుచిర్ శర్మ. రోజు రోజుకు మోదీకి ఉన్న అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏడాది ఏడాదికి ఆయన గ్రాఫ్ పడిపోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి మోదీ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలు గతేడాది 99 శాతం ఉంటే ప్రస్తుతం అవి 50 శాతానికి పడిపోయాయని వివరించారు. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతుండడమే అందుకు కారణమన్నారు.

2004కు ముందు వాజ్‌పేయితో సరితూగే నేతలు ఎవరూ ప్రతిపక్షాల్లో లేరని, కానీ ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావడంతో పరిస్థితులు మారిపోయాయన్నారు. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు ఉన్నాయని, ప్రతిపక్షాలన్నీ ఏకమైతే మళ్లీ ప్రధాని కావాలన్న మోదీ ఆశ నిరాశగానే మిగిలిపోతుందని రుచిర్ శర్మ తెలిపారు.

More Telugu News