vijay sethupathi: ఆసక్తినిరేపుతోన్న '96' మూవీ ట్రైలర్

  • కొత్త లుక్ తో విజయ్ సేతుపతి 
  • మరింత గ్లామర్ గా త్రిష 
  • ఈ నెల 31వ తేదీన విడుదల

తమిళంలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా '96' సినిమా రూపొందింది. నందగోపాల్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సన్నివేశాలను .. ప్రస్తుతం జరుగుతోన్న సన్నివేశాలను జోడిస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

విజయ్ సేతుపతి .. త్రిష పాత్రలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కొత్త లుక్ తో కనిపిస్తుంటే, త్రిష మరింత గ్లామర్ గా అనిపిస్తోంది. ఈ సినిమా తమ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని నాయకా నాయికలు భావిస్తున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.  

More Telugu News