Gurmeet Ram Rahim Singh: మరో కేసులో డేరాబాబాకు బెయిల్ నిరాకరణ

  • ఇప్పటికే అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా 
  • 400 మందిని నపుంసకులుగా మార్చిన మరో కేసు 
  • బెయిల్ ఇవ్వద్దని వాదించిన సీబీఐ  

సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో డేరాబాబాకు చుక్కెదురైంది. డేరాబాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ పెట్టుకున్న బెయిల్ పిటీషన్ ను సీబీఐ స్పెషల్ కోర్టు తిరస్కరించింది. ఆశ్రమంలోని మహిళలపై అత్యాచారం చేసిన కేసులో డేరాబాబా ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంచితే, తన ఆశ్రమంలో నాలుగు వందల మంది పురుషులను నపుంసకులుగా మార్చివేశాడంటూ దాఖలైన మరో కేసులో డేరాబాబాకు బెయిల్ ఇవ్వడానికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తాజాగా నిరాకరించింది. ఈ కేసులో తనతో పాటు ఉన్న మరో ఇద్దరు నిందితులైన డాక్టర్ ఎంపీ సింగ్, డాక్టర్ పంకజ్ సింగ్‌లకు బెయిల్ ఇచ్చిన కారణంగా తనకు కూడా బెయిల్ ఇవ్వాలని డేరా బాబా కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నాడు.

అయితే డేరాబాబాపై ఇప్పటికే అభియోగాలు నమోదు చేసినందున బెయిల్ ఇవ్వరాదని సీబీఐ వాదించింది. కాగా, మాజీ అనుచరుడు హన్స్‌రాజ్ చౌహాన్ ఫిర్యాదు మేరకు... డేరా బాబా వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని 2014లో హర్యానా పంజాబ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది.  

More Telugu News