Congress: సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనున్న కోమటి రెడ్డి, సంపత్ కుమార్!

  • హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్న నేతలు
  • సింగిల్ జడ్జీ తీర్పు అమలును కోరే అవకాశం
  • ధ్రువీకరించిన కాంగ్రెస్ పార్టీ వర్గాలు

తమ శాసనసభ సభ్యత్వాల పునరుద్ధకరణపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, సంపత్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. సభలో అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారంటూ వీరి అసెంబ్లీ సభ్యత్వాలను స్పీకర్ రద్దుచేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జీ ధర్మాసనం సభ్యత్వాలను పునరుద్ధరిస్తూ తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టులో అప్పీల్ దాఖలుచేశారు. ఈ పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును రెండు నెలలపాటు సస్పెండ్ చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి కోర్టు ధిక్కార పిటిషన్ పై తదుపరి విచారణను నిలుపుదల చేసింది.

హైకోర్టు తమ అసెంబ్లీ సభ్యత్వాల పునరుద్ధరణను నిలిపివేయడంపై కాంగ్రెస్ నేతలు సంపత్, కోమటి రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

More Telugu News