Mamata Banerjee: సుప్రీంలో పశ్చిమ బెంగాల్ 'పంచాయతీ'.. మమతా బెనర్జీకి కోర్టు షాక్‌!

  • పంచాయతీ ఫలితాలపై అభ్యంతరాల  స్వీకరణకు ఓకే
  •  పిటిషన్ల దాఖలుకు 30 రోజుల గడువు`
  •  ఫలితాల విడుదలకు అనుమతి 

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాదాపు నలభై శాతం సీట్లు ఏకగ్రీవంగా గెల్చుకున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆనందంపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది. ఫలితాలపై అభ్యంతరాల స్వీకరణకు విపక్షాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 30 రోజుల్లో పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఫలితాలు విడుదల చేసుకునేందుకు మాత్రం అనుమతిచ్చింది.

రాష్ట్రంలోని  58,692 గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌, సమితి స్థానాలకు ఈ ఏడాది మేలో ఎన్నికలు జరిగాయి. ఇందులో 20,159 స్థానాల్లో తృణమూల్‌ అభ్యర్థులు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చాలా స్థానాల్లో హింస ప్రజ్వరిల్లింది. అధికార టీఎంసీ అభ్యర్థులు తమను నామినేషన్‌ వేయకుండా అడ్డుకుని ఏకగ్రీవం చేసుకున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విషయం అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వెళ్లడంతో కోర్టు సీరియస్‌గా పరిగణించి తాజా ఆదేశాలు జారీచేసింది. వాట్సాప్‌, ఈ-మెయిల్‌ ద్వారా నామినేషన్ల దాఖలుకు అనుమతినిచ్చిన కలకత్తా హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది. 

More Telugu News