USA: అమెరికా అమ్ముల పొదిలోకి జిత్తులమారి విమానం!

  • శత్రుదేశాల విమానాల్లా భ్రమ కలిగించే మల్డ్-ఎక్స్
  • రాడార్లను దెబ్బతీసే సామర్ధ్యం
  • త్వరలోనే అమెరికా వాయుసేన చేతికి

ఆయుధాలు, రక్షణ పరికరాల తయారీలో అగ్రగామిగా ఉన్న అమెరికా తాజాగా మరో సరికొత్త యుద్ధ విమానాన్ని సమకూర్చుకుంటోంది. శత్రుదేశాల భూభాగంలోకి వెళ్లినప్పుడు వారి ఫైటర్ జెట్లలా భ్రమ కలిగించే ఆధునిక విమానం త్వరలోనే అగ్రరాజ్యం వైమానిక దళంలో చేరనుంది. ఈ యుద్ధ విమానాన్ని ఇటీవలే విజయవంతంగా పరీక్షించినట్లు అమెరికా మిలటరీ అధికారులు చెప్పారు.

ఈ విమానానికి మినియేచర్ ఎయిర్ లాంచ్ డెకాయ్-ఎక్స్(మల్డ్ ఎక్స్)గా పేరు పెట్టారు. అమెరికా వాయుసేన కోసం ఈ విమానాన్ని రేథియోన్ సంస్థ అభివృద్ధి చేసింది. దీని సాయంతో శత్రు దేశాల రాడార్లను దెబ్బతీయొచ్చని, వాటిని బురిడీ కొట్టించవచ్చని మిలటరీ అధికారులు చెబుతున్నారు. శత్రు దేశాల విమానాల తరహాలో రాడార్ సిగ్నల్స్ ను విడుదల చేస్తూ వారిని ఈ విమానం బురిడీ కొట్టిస్తుందని వెల్లడించారు.

More Telugu News