Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కొత్తదనం కోసమే కీర్తి ఎదురుచూపులు!
  • రాజశేఖర్ కొత్త సినిమాకు టైటిల్ ఖరారు 
  • భారీ రేటు పలుకుతున్న ఎన్టీఆర్ చిత్రం 

*  కొత్తదనంతో కూడిన కథా చిత్రాలలో నటించడమే తనకు ఇష్టమంటోంది కథానాయిక కీర్తి సురేశ్. 'కథలో నవ్యత వుండాలి. అప్పుడే పాత్రలు కూడా వేటికవే కొత్తగా వుంటాయి. అలాంటి కథల కోసమే ఎదురుచూస్తున్నాను. ఆ క్రమంలోనే 'మహానటి' చేయగలిగాను' అని చెప్పింది కీర్తి.
*  'గరుడవేగ' హిట్ తర్వాత డాక్టర్ రాజశేఖర్ తాజాగా ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. కాగా, ఈ చిత్రానికి 'కల్కి' అనే టైటిల్ని నిర్ణయించినట్టు సమాచారం.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అరవింద సమేత' చిత్రానికి బిజినెస్ పరంగా మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా సీడెడ్ లో ఈ చిత్రానికి 15 కోట్ల వరకు ఆఫర్లు వస్తున్నాయట.

More Telugu News