pooja shakun pandey: గాడ్సే ఆ పని చేయకుంటే గాంధీని నేను చంపేసి ఉండేదాన్ని: పూజ శకున్ పాండే సంచలన వ్యాఖ్యలు

  • గాడ్సేకు నేను వీరాభిమానిని
  • గాంధీని గాడ్సే చంపలేదు
  • రాజ్యాంగం అమల్లోకి వచ్చే లోపే అతడిని శిక్షించారు

స్వయం ప్రకటిత, వివాదాస్పద హిందూ కోర్టు న్యాయమూర్తి, సామాజిక కార్యకర్త పూజ శకున్ పాండే మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాథూరామ్ గాడ్సేను తాను ఆరాధిస్తానని, అప్పట్లో మహాత్మాగాంధీని ఆయన చంపకుంటే తానే ఆ పనిచేసే దానినని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశాన్ని విభజించాలని భావించే గాంధీ ఒకరుంటే.. అడ్డుకునే గాడ్సే మరొకరు ఉంటారని ఆమె పేర్కొన్నారు. గాడ్సేను తాను ఆరాధిస్తానని, ఆ విషయాన్ని చెప్పడానికి గర్విస్తున్నానని చెప్పుకొచ్చారు. నిజానికి గాంధీని గాడ్సే చంపలేదని తేల్చి చెప్పారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేలోపే అతడిని శిక్షించారని పూజ వివరించారు.

హిందూ కోర్టు పేరుతో అఖిల భారత హిందూ సభ (ఏబీహెచ్ఎం) ఇటీవల మీరట్‌లో సొంతంగా వివాదాస్పద న్యాయస్థానాన్ని ప్రారంభించింది. దానికి పూజ శకున్‌ పాండేను న్యాయమూర్తిగా నియమించింది. ఈ కోర్టులపై ఓపక్క అలహాబాద్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాగా, పూజ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ పేరుతో భర్తల చేతిలో మోసపోయిన ముస్లిం మహిళలు హిందూ ధర్మాన్ని అనుసరించాలని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదం అయ్యాయి.

More Telugu News