Kerala: ఈ నెల 26న హైదరాబాద్ రానున్న ప్రియా వారియర్

  • 26న సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక
  • ‘బెస్ట్ ఫేస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకోనున్న ప్రియ
  • ఈ విషయాన్ని వెల్లడించిన ‘సంతోషం’ అధినేత 

కేరళ సెన్సేషనల్ బ్యూటీ ప్రియా వారియర్ హైదరాబాద్ రానుంది. ఈ నెల 26న
హైదరాబాద్ లో జరగనున్న16వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు ప్రియా వారియర్ హాజరు కానుంది. ‘బెస్ట్ ఫేస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆమె అందుకోనుంది. ఈ విషయాన్ని సంతోషం సినీ మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తెలిపారు. ఈ విషయమై ప్రియా వారియర్ అధికారికంగా మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. కాగా, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు సమాచారం.

More Telugu News