Narendra Modi: 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి అందరికీ సొంతిళ్లు!: మోదీ

  • భారతీయులందరికీ 2022 నాటికి సొంతిళ్లు తన కల అన్న ప్రధాని  
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందరూ ఇళ్లు నిర్మించుకోవాలని పిలుపు 
  • ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ప్రధాని 

'2022లో భారతదేశం తన 75వ స్వాతనత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అప్పటికి భారతీయులందరికీ సొంతిళ్లు సమకూరాలన్నది నా కల' అన్నారు ప్రధాని మోదీ. ఇప్పటి వరకు రాజకీయ నాయకులే సొంతిళ్లు నిర్మించుకున్నారన్న వార్తలను మనం వింటూ వచ్చామని, ఇకపై పేదలు కూడా సొంత ఇళ్లు సంపాదించుకున్నారన్న వార్తలూ మనం వింటామని ప్రధాని చెప్పారు.

  గుజరాత్ రాష్ట్రంలోని వల్సద్ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద నిర్మించిన లక్ష ఇళ్లలో ప్రధాని సమక్షంలో మహిళలు ఈ రోజు గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా జజ్వా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. సొంతిల్లు పొంది సంతోషంగా వున్న మహిళలతో మాట్లాడే అవకాశం తనకు కలిగిందని చెప్పిన ప్రధాని, భారతీయులందరికీ 2022లోపు సొంత ఇళ్లు ఉండాలన్నదే తన కల అని పేర్కొన్నారు.  

 రక్షా బంధన్ కంటే ముందే ఆడపడుచులకు సొంతిల్లు ఇవ్వటం కన్నా మంచి బహుమతి ఏముంటుంది? అని ప్రధాని ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద అందరూ ఇళ్లు నిర్మించుకోవాలన్న ఆయన, బ్యాంకులు మీ దగ్గరకే వచ్చి అప్పులు ఇస్తాయని, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం గుజరాత్ లో ఇళ్లు పొందిన మహిళలు సంతృప్తిగా ఉన్నారన్న ప్రధాని, అందరూ సొంతిల్లు నిర్మించుకుని అంతే సంతృప్తిగా ఉండాలని కోరారు.  

More Telugu News