kcr: కేంద్ర ఎన్నికల కమిషనర్ తో రాజీవ్ శర్మ భేటీ.. ముందస్తు ఎన్నికలకే కేసీఆర్ మొగ్గు?

  • అశోక్ లావాసాతో భేటీ అయిన రాజీవ్ శర్మ, కేఎం సహానీ
  • ముందస్తు ఎన్నికలపై చర్చ
  • అటార్నీ జనరల్ తో కూడా సమావేశమైన రాజీవ్ శర్మ

ముందస్తు ఎన్నికలకే ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల గురించి ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. ఈ భేటీకి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కేఎం సహానీ కూడా హాజరయ్యారు.

ముందస్తు ఎన్నికల నిర్వహణ, సాధ్యాసాధ్యాలపై వీరు చర్చించినట్టు సమాచారం. అనంతరం అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తో కూడా రాజీవ్ శర్మ భేటీ అయ్యారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో, ముందస్తు ఎన్నికల కోసం తెలంగాణ ప్రతినిధులు ఢిల్లీలో కసరత్తును ముమ్మరం చేసినట్టు అర్థమవుతోంది. మరోవైపు, నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో... ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని కేసీఆర్ కు మెజార్టీ మంత్రులు తెలిపిన సంగతి గమనార్హం.

More Telugu News