gita govindam: ‘గీత గోవిందం’ చిత్రయూనిట్ ని అభినందించిన ఎంపీ కవిత

  • హైదరాబాద్ లోని కవిత నివాసానికి వెళ్లిన చిత్రయూనిట్
  • ఈ సినిమా చాలా బాగుంది
  • ఇప్పటికే రెండు సార్లు చూశానన్న కవిత

ఇటీవల విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రం హిట్ టాక్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం చాలా బాగుందని టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా చిత్ర యూనిట్ ని ప్రశంసలతో ముంచెత్తారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని కవిత నివాసానికి ఈ చిత్ర హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాం, నిర్మాత బన్నీవాసు వెళ్లి కలిశారు. చిత్రయూనిట్ ని అభినందించిన కవిత, వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సినిమా చాలా బాగుందని, ఇప్పటికే రెండు సార్లు చూశానని, ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తనకు బాగా నచ్చాయని వారితో ఆమె అన్నారు. కాగా, ‘మీరు ఈ సినిమా చూస్తారని, మమ్మల్ని ఇలా అభినందిస్తారని అసలు ఊహించలేదు’ అని కవితతో చెప్పిన బన్నీ వాస్ సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News