Motion Teaser: పోయేది శ్రీశైలానికి కాదురా.. కైలాసానికి!: ఫన్ తో అదరగొడుతున్న ‘సిల్లీ ఫెలోస్’

  • టీజర్ విడుదల చేసిన నిర్మాత బీఏ రాజు
  • ఆకట్టుకుంటున్న సునీల్, నరేశ్ కామెడి
  • నరేశ్ స్పీడ్ కు హడలిపోతున్న సునీల్

అల్లరి నరేశ్, సునీల్ కాంబినేషన్ లో సిల్లీ ఫెలోస్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ టీజర్ ను నిర్మాత బీఏ రాజు ఈ రోజు ట్విట్టర్ లో విడుదల చేశారు. గమ్యం సినిమాలో గాలిగాడిలా అల్లరి నరేశ్ బైక్ పై దూసుకుపోతుంటే.. వెనుక గాలిపటంలా సునీల్ ఎగురుతున్న టీజర్ ఆకట్టుకుంటోంది.

ఈ స్పీడ్ తో వెళితే శ్రీశైలానికి గంటలో వెళ్లిపోతాం కదరా? అని సునీల్ ను నరేశ్ అడిగితే.. సునీల్ ‘గంట ఎందుకురా? అరగంటలోనే వెళ్లిపోతాం.. కైలాసానికి’ అని హడలిపోతూ చెప్పడం చూడొచ్చు. ఈ సినిమాలో హీరోయిన్లుగా చిత్ర శుక్లా, పూర్ణ, నందిని రాయ్ నటిస్తున్నారు. భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

More Telugu News