Cricket: ఫస్ట్ క్లాస్ క్రికెట్ నాటి సాధన ఫలితమిది : బుమ్రా

  • ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌ హీరో బుమ్రా
  • గాయమైనా ఫిట్‌నెస్‌ కోసం కఠోర సాధన

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన సీమర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ప్రస్తుతం ఈ విజయానందంలో ఖుషీగా కనిపిస్తున్నాడు. కెమెరా కంటిలో పడే స్థాయి లేనప్పుడు రంజీ క్రీడాకారుడిగా తాను చేసిన కఠోర సాధన ఇప్పుడు ఫలితం ఇస్తోందని చెబుతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లు సాధించిన విషయం తెలిసిందే.

‘ఎవరికీ ఏదీ అంత సులువుగా దక్కదు. బాగా కష్టపడాలి. రంజీట్రోఫీకి ఆడేటప్పుడు చాలా ఓవర్లు వేసేవాడిని. ఆ కష్టమే ఇప్పుడు ఫలితమిస్తోంది. తెలుపు బంతితో పోల్చితే ఎరుపు బంతి క్రికెట్‌లో నిలకడ, ఓర్పు చాలా అవసరం. ఇంగ్లండ్‌తో టెస్ట్‌లో నాల్గో రోజు ఈ అంశాలపైనే దృష్టిపెట్టాను’ అన్నాడీ ఫేసర్‌.

 ‘నేనెప్పుడూ లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు విసిరి బ్యాట్స్‌మన్‌కి సవాల్‌ విసురుతా. బట్లర్‌ను అవుట్‌ చేసేందుకు ఇంతకు ముందు నాకు ఉపయోగపడిన టెక్నిక్‌లన్నీ అనుసరించా. కొత్తబంతికి సీమ్‌ తోడు కావడంతో బట్లర్‌ వికెట్‌ చిక్కింది. మ్యాచ్‌ని ములుపుతిప్పింది’ అంటూ బుమ్రా తన సంతోషాన్ని పంచుకున్నాడు.

More Telugu News