portable petrol pump: అందుబాటులోకి రానున్న పోర్టబుల్ పెట్రోల్ బంక్ లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం!

  • పోర్టబుల్‌ డిజైన్‌తో ముందుకు వచ్చిన అలింజ్‌ గ్రూప్‌
  • 20X20 మీటర్ల స్థలంలో ఏర్పాటు
  • 10 వేల నుంచి 35 వేల లీటర్ల సామర్థ్యం

వాహనాల సంఖ్యతోపాటు పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ నేపథ్యంలో బుల్లి పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటు ప్రయత్నం జరుగుతోంది. ఇంధనం సమకూర్చే పోర్టబుల్‌ బంక్ ల డిజైన్‌తో అలింజ్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది. ప్రభుత్వం అనుమతిస్తే దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ పోర్టబుల్‌ పంప్‌ స్టేషన్ల ఏర్పాటుకు ఈ సంస్థ సన్నాహాలు చేస్తోంది. కేవలం 20 X 20 మీటర్ల స్థలంలో 10 వేల నుంచి 35 వేల లీటర్ల సామర్థ్యంతో ఈ బంక్‌ను రెండు గంటల్లోనే ఏర్పాటు చేయొచ్చని చెబుతోందీ సంస్థ.

ట్యాంక్‌ సామర్థ్యాన్ని పెంచాల్సి వస్తే స్థలం పెరుగుతుందంటోంది. డిజిటల్‌ చెల్లింపులతోపాటు సీసీ కెమెరా భద్రత ఉంటుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  సంప్రదింపులు జరిపామని, దేశమంతటా ఈ పోర్టబుల్‌ పంపులు ఏర్పాటే తమ లక్ష్యమని అలింజ్‌ గ్రూప్‌ సంస్థ ఎండీ ఇంద్రజిత్‌ తెలిపారు. పోర్టబుల్‌ ఎల్‌పీజీ అవుట్‌లెట్లు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

More Telugu News