TTD: టీటీడీలో లైంగిక వేధింపుల కలకలం.. పోలీసులను ఆశ్రయించిన మహిళా ఉద్యోగి!

  • ఏఈవో స్థాయి అధికారి వేధింపులు
  • ఇన్నాళ్లూ ఓపిక పట్టిన యువతి
  • చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శ్రీనివాస మంగాపురం ఆలయంలో ఏఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసులు తన కుమార్తెను వేధిస్తున్నాడని అన్నపూర్ణమ్మ మహిళా ఉద్యోగి ఈ రోజు పోలీసులను ఆశ్రయించింది. అతని నుంచి తన కుమార్తెకు రక్షణ కల్పించాలని వేడుకుంది. ఈ మేరకు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో సదరు అధికారిపై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది.

తనతో పాటు కుమార్తె కూడా ఆలయంలోనేే పనిచేస్తోందని అన్నపూర్ణమ్మ తెలిపింది. అయితే సదరు అధికారి కుమార్తెను లైంగికంగా వేధించడంతో పాటు అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఫోన్ చేసి ఇక్కడికి రా, అక్కడి రా అంటూ వేధించేవాడని వాపోయింది. కాగా ఏఈవో శ్రీనివాసులు వేధింపులు శ్రుతి మించడంతో ఇన్నాళ్లు ఓపిక పట్టిన అన్నపూర్ణమ్మ, కుమార్తెతో కలసి ఈ రోజు పోలీసులను ఆశ్రయించింది. అలాగే టీటీడీ జేఈవోకు కూడా ఆమె ఫిర్యాదు చేయడంతో ఆయన విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. శ్రీనివాసులుపై గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో బదిలీవేటు పడినట్లు అధికారులు చెబుతున్నారు.

More Telugu News