Supreme Court: అత్యాచారం కేసులో ఏడేళ్ల శిక్ష అనుభవించాడు.. ఇప్పుడు నిర్దోషిగా బయటపడ్డాడు!

  • బాలికపై అత్యాచారం కేసు 
  • ఏడేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి 
  • సుప్రీంలో ఊరట.. దిగువ కోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం

బంధువైన మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. షాంసింగ్‌ అనే ఈ వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. కాకపోతే ఇప్పటికే షాంసింగ్‌ ఏడేళ్ల జైలు జీవితం పూర్తి చేయడం విశేషం.

వివరాల్లోకి వెళితే...ఫరీదాబాద్‌కు చెందిన ఓ పదిహేనేళ్ల బాలికపై 2001లో షాంసింగ్‌ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. కేసు విచారించిన కింది కోర్టు నిందితుడిని దోషిగా ప్రకటించి, పదేళ్ల జైలు శిక్ష విధించింది. కింది కోర్టు తీర్పును 2011లో పంజాబ్‌ హర్యానా హైకోర్టు కూడా సమర్థించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ షాంసింగ్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశయ్రించగా నేరనిర్థారణ జరగలేదంటూ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ మోహన్‌, జస్టిస్‌  ఎం.శాంతనగౌడర్‌లతో కూడి ధర్మాసం కింది కోర్టు తీర్పును కొట్టేసింది. 

More Telugu News