Polavaram: పోలవరం ప్రాజెక్టును చుట్టుముట్టిన నీరు.. మూడువేల మంది కార్మికులను ఖాళీ చేయించిన అధికారులు

  • గోదావరికి వరద ఉద్ధృతి
  • ప్రాజెక్టులోకి వచ్చి చేరిన నీళ్లు
  • స్పిల్‌వే లోకి రాకుండా మట్టిదిబ్బ ఏర్పాటు

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పెరిగి పోలవరం ప్రాజెక్టును చుట్టుముట్టింది. ప్రాజెక్టు పనులు చేస్తున్న త్రివేణి క్యాంపులో దాదాపు 4 అడుగుల మేర వరద నీరు వచ్చి చేరడంతో సామగ్రి నీట మునిగింది. అలాగే, ప్రాజెక్టులో కీలక నిర్మాణమైన స్పిల్‌వే, స్పిల్ చానల్ చుట్టూ 9 అడుగుల మేర వరద చేరింది.

 దీంతో స్పిల్ వేలోకి నీరు రాకుండా భారీ డంపర్లు, ఎక్స్‌కవేటర్లతో పది అడుగుల ఎత్తున పెద్ద మట్టి గుట్ట పేర్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కార్మికుల కోసం ఎగువ భాగంలో గతంలో వేసిన క్యాంపుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో అందులో చిక్కుకున్న మూడు వేల మందిని ఖాళీ చేయించారు. ప్రాజెక్టులోకి వచ్చి చేరిన నీటిని తోడి బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News