Chiranjeevi: తన కొత్త చిత్రం గురించి చెప్పి.. ‘మెగాస్టార్’ కు బర్త్ డే విషెస్ చెప్పిన రాజశేఖర్

  • రాజశేఖర్ కొత్త చిత్రం ప్రీ లుక్ వెరైటీగా విడుదల
  • 1983 నేపథ్యంగా ఈ కొత్త చిత్రం
  • చిరంజీవి ‘ఖైదీ’ గురించి ప్రస్తావించిన రాజశేఖర్

టాలీవుడ్ నటుడు రాజశేఖర్ తన కొత్త చిత్రం ప్రీ లుక్ ను వెరైటీగా విడుదల చేశారు. ‘అ’ చిత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని 1983 నేపథ్యంలో, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించనున్నారు.

1983లో క్రికెట్ వరల్డ్ కప్ ను భారత్ తొలిసారి సొంతం చేసుకుంది. టాలీవుడ్ విషయానికొస్తే.. అదే ఏడాదిలో విడుదలైన ‘ఖైదీ’ చిత్రం చిరంజీవిని ‘స్టార్’ని చేసింది. ఈ రెండు అంశాలను కూడా రాజశేఖర్ ఈ ప్రీ లుక్ పోస్టర్లో ప్రస్తావించడం ఆసక్తిదాయకం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ నెల 26న రాఖీ పౌర్ణమి సందర్భంగా తన కొత్త చిత్రం టైటిల్, నటీనటుల వివరాలను ప్రకటించనున్నట్టు రాజశేఖర్ తెలిపారు.

More Telugu News