Mazlis: ఈ సవతి తల్లి ప్రేమేంటి?: యూఏఈ ఇస్తుంటే తీసుకోవడానికి బాధేంటి?: అసదుద్దీన్ నిప్పులు

  • కేరళకు రూ. 700 కోట్లు ప్రకటించిన యూఏఈ
  • దాన్ని స్వీకరించేందుకు ఇండియా సిద్ధంగా లేదని వార్తలు
  • మండిపడిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ

బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందని మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. కేరళకు యూఏఈ ప్రభుత్వం రూ. 700 కోట్లను సాయంగా ప్రకటిస్తే, దాన్ని తీసుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. గత సంవత్సరం ఇండియాకు 69 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం రాగా, అందులో 40 శాతం కేరళ వాసులదేనని, వారిలో అత్యధికులు యూఏఈ తదితర అరబ్ దేశాల్లో స్థిరపడిన వారేనని గుర్తు చేశారు.

కేంద్రం కేరళకు కేవలం రూ. 600 కోట్లను మాత్రమే ప్రకటించడం సిగ్గు చేటని వ్యాఖ్యానించిన ఆయన, యూఏఈ ఇస్తుంటే, తీసుకోవడానికి బాధ ఎందుకని అడిగారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు నామమాత్రంగా సాయం చేయడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల విగ్రహాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు, నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ముందుకు రావడం లేదని విమర్శలు గుప్పించారు.

More Telugu News