chiranjeevi: రికార్డు స్థాయిలో దూసుకుపోతోన్న 'సైరా' టీజర్

  • ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు 
  • అభిమానుల్లో ఆనందోత్సాహాలు 
  • భారీ బడ్జెట్ తో రానున్న 'సైరా'      

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈ రోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్ననే 'సైరా' సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. 'సైరా' విడుదలకి చాలా సమయం ఉన్నప్పటికీ, మెగా అభిమానులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ఈ టీజర్ ను వదిలారు. ఈ టీజర్ ను రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 11 మిలియన్ల డిజిటల్ వ్యూస్ లభించాయి. దీనిని బట్టి ఈ సినిమాపై ఏ స్థాయిలో అందరిలో ఆసక్తి వుందో అర్థమవుతోంది.

'సైరా' నుంచి వచ్చిన ఫస్టు టీజర్ కి అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ టీజర్ సూపర్బ్ గా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ టీజర్ అభిమానుల అంచనాలను అందుకునేలా .. వాళ్లకు సంతృప్తిని కలిగించేలా వుందని చెబుతున్నారు. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో 'బాహుబలి' స్థాయి కథాకథనాలతో .. భారీతారాగణంతో .. సాంకేతిక విలువలతో ఈ సినిమా రానుందనే ఆసక్తితో అందరూ వున్నారు.     

More Telugu News