paruchuri: పరిటాల రవికి విపరీతమైన కోపం వచ్చేసింది: పరుచూరి గోపాలకృష్ణ

  • పరిటాల రవి స్క్రిప్టులో ఒక మార్పు చెప్పారు
  • ఫెయిర్ చేసే కుర్రాడితో ఆ మార్పు చేయమని అన్నాను
  • అతను ఆ విషయం మరిచిపోయాడు  

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ  మాట్లాడుతూ, 'శ్రీరాములయ్య' సినిమాకి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు. 'శ్రీరాములయ్య' స్క్రిప్ట్ అంతా పరిటాల రవికి రీడింగ్ ఇచ్చేశాక, ఒక సీన్ దగ్గర 'ఇక్కడ సుభాష్ చంద్ర బోస్ పేరుకు బదులుగా భగత్ సింగ్ అని మార్చు అన్నా' అన్నారు. అలాగేనని చెప్పి .. ఫెయిర్ చేయమని మా అసిస్టెంట్ కి ఇచ్చాను. 'సుభాష్ చంద్ర బోస్' పేరు స్థానంలో 'భగత్ సింగ్' పేరు రాయమని కూడా చెప్పాను.

అలాగేనని ఆ కుర్రాడు స్క్రిప్ట్ ను ఫెయిర్ చేసుకొచ్చాడు. ఆ తరువాత పరిటాల రవి వచ్చి 'అన్నా అయిందా' అంటే .. అయిందని చెప్పేసి ఆయన చేతికి స్క్రిప్ట్ ను ఇచ్చాను. ఆయన స్క్రిప్ట్ పేజీలు తిరగేయగానే 'సుభాష్ చంద్ర బోస్' అనే పేరు అలాగే వుంది. దాంతో ఆయనకు కోపం వచ్చేసింది. డబ్బులు తెచ్చి టేబుల్ పై పెట్టి,.. 'నేను చెప్పినట్టు నువ్వు చేయలేదన్నా .. నా కొద్దూ .. ఇదిగో మీతో ఏదైతే మాట్లాడుకున్నానో ఆ డబ్బులు ఇక్కడ పెట్టేశాను" అని నాతో అన్నారు. నేను జరిగింది చెబుతూ మా అసిస్టెంట్ ను తిట్టేశాను. మా అన్నయ్య వచ్చి ఫెయిర్ చేసే కుర్రాడు మరిచిపోవడం వలన జరిగిన తప్పు ఇది' అని పరిటాలకు సర్ది చెప్పారు. అప్పుడు ఆయన కోపం తగ్గింది .. ఆ తరువాత సినిమా మొదలైంది' అని చెప్పుకొచ్చారు.   

More Telugu News