Srisailam: శ్రీశైలానికి భారీ వరద... తెరచుకున్న మూడు గేట్లు

  • ఎగువ నుంచి మళ్లీ వరద ప్రవాహం
  • నిన్న మూసిన గేట్లను నేడు తెరచిన అధికారులు
  • 1,99,797 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం డ్యామ్ మూడు గేట్లను అధికారులు తెరిచారు. వరద ప్రవాహం తగ్గడంతో నిన్న గేట్లను మూసివేసిన సంగతి తెలిసిందే. ఆపై ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి శ్రీశైలానికి 1,99,797 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 885 అడుగుల నీటి నిల్వ సామర్థ్యమున్న రిజర్వాయర్ లో 883.20 అడుగులకు నీరు చేరింది. దీంతో వరద ప్రవాహం కొనసాగే అవకాశాలు ఉన్నాయని కర్ణాటక అధికారులు చెప్పడంతో, సాగర్ కు మరింతగా నీటిని విడుదల చేస్తున్నారు. కల్వకుర్తికి 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,326 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 26 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

More Telugu News