Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • డబ్భై ఏళ్ల బామ్మగారి పాత్రలో సమంత!
  • మహేశ్ బాబుకి తల్లిగా జయప్రద 
  • 'అభినేత్రి'కి సీక్వెల్ చేస్తానంటున్న ప్రభుదేవా 

*  అందాల సమంత త్వరలో 70 ఏళ్ల బామ్మ పాత్రను చేయనుంది. కొరియన్ చిత్రం 'మిస్ గ్రానీ'ని సురేశ్ ప్రొడక్షన్స్ తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నందినిరెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రంలో సమంత డబ్భై ఏళ్ల బామ్మగారి పాత్ర పోషించనుంది.
*  నిన్నటితరం అందాల నటి జయప్రద తాజాగా మహేశ్ బాబు చిత్రంలో నటిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న 'మహర్షి' చిత్రంలో జయప్రద హీరోకి తల్లిగా కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
*  ఆమధ్య తమన్నా హీరోయిన్ గా ప్రభుదేవా 'అభినేత్రి' చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుదేవా స్వయంగా వెల్లడించాడు. దర్శకుడు ఏఎల్ విజయ్ తో కలసి 'అభినేత్రి' సీక్వెల్ చేయనున్నట్టు ప్రభుదేవా తెలిపాడు.

More Telugu News