Andhra Pradesh: సెప్టెంబర్ 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులను ప్రవేశ పెట్టే యోచన

  • ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు నితిఫికేషన్  
  •  కీలక బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
  •  సమావేశాలకు హాజరుకావాలని జగన్ ను కోరనున్న స్పీకర్

ఏపీ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు సెప్టెంబర్ 6 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. పది రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలలో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

గత సమావేశాలను వైసీపీ బహిష్కరించినందువల్ల, ఈసారి జరగనున్న సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ హాజరుకావాలని వైఎస్ జగన్ ను స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా భూసేకరణ సవరణ బిల్లు, సీఆర్డీయేకు సంబంధించిన కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ఈ వారంలో కీలకశాఖల అధికారులతో సీఎం సమావేశాన్ని నిర్వహించనున్నారు. 

More Telugu News