Shashi Tharoor: శశిథరూర్ పై కేరళ ప్రభుత్వం ఫైర్.. కేరళ రాయబారివా? అంటూ నిలదీత

  • కేరళ రాష్ట్ర రాయబారిగా సహాయం అడుగుతా
  • కేరళ ప్రభుత్వం ఎవరినీ ప్రతినిధిగా పంపలేదు 
  • శశిథరూర్ వ్యాఖ్యలను ఖండించిన కేరళ 

కోర్టు అనుమతితో జెనీవా వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అప్పుడే చిక్కుల్లో పడ్డారు. కేరళ రాష్ట్రానికి వరద సహాయం కోసం ఆ రాష్ట్ర రాయబారిగా వచ్చానని, ఐక్య రాజ్య సమితి సహాయం కోరతానని ఆయన ట్విట్టర్ లో పేర్కొనడంపై వివాదం రేగుతోంది. ఐక్యరాజ్య సమితితో గతంలో తనకున్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని కేరళ వరదల విషయమై సహాయం కోసం వచ్చానని, ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో సంప్రదిస్తున్నానని, ఆ రాష్ట్ర ప్రతినిధిగా సహాయం కోరతానని శశిథరూర్ ట్విట్టర్ లో తెలియజేశారు.

అయితే, కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై మండిపడుతోంది. తాము శశిథరూర్ ని తమ రాయబారిగా పంపలేదని చెప్పి ఆయన వ్యాఖ్యలను ఖండించింది. తిరువనంతపురం నుండి లోక్ సభ సభ్యుడిగా గెలిచినంత మాత్రాన ప్రభుత్వం తరపున రాయబారి అని ఎలా ప్రకటించుకుంటారు? అని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం శశిథరూర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమరు చెయ్యదలుచుకున్న సాయం అవసరం లేదని ప్రకటించింది. ఈ విషయంపై బీజేపీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

 శశిథరూర్ ఒక మంచి ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితిని సహాయం కోరడంలో తప్పేంలేదని కాంగ్రెస్ వాదిస్తోంది. 20 వేల కోట్ల భారీ నష్టం జరిగిన కేరళకు సహాయం చేయాలని ఆ రాష్ట్ర ఎంపీ శశిథరూర్ ఐక్యరాజ్య సమితిని అడుగుతానంటే కావాలనే బీజేపీ రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది.  

More Telugu News