Google: గూగుల్ లో ప్రైవసీ ఎక్కడుంది?: కోర్టులో దావా వేసిన అమెరికన్

  • గూగుల్ ప్రైవసీ చట్టాన్ని ఉల్లంఘించిందని దావా
  • దీని వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుంది 
  • లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసినా లొకేషన్ ట్రాక్ చేస్తోంది 

ప్రైవసీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, తన వ్యక్తిగత గోప్యతకు గూగుల్ భంగం కలిగించిందని ఆరోపిస్తూ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడరల్‌ కోర్టులో ఓ వ్యక్తి దావా వేశాడు. గూగుల్ సెట్టింగ్స్ లో 'లొకేషన్ హిస్టరీ' ఆప్షన్ ను ఆఫ్ చేసిప్పటికీ తమ లొకేషన్ ను ట్రాక్ చేస్తోందని కాలిఫోర్నియాకు చెందిన ఆ వ్యక్తి తన ఫిర్యాదులో ఆరోపించాడు.  

ప్రైవసీ విషయంలో గూగుల్ చెప్పినదంతా అసత్యమని పేర్కొన్న సదరు వ్యక్తి, గూగుల్ ప్రైవసీ చట్టాన్ని ఉల్లంఘించిందన్న విషయాన్ని యూనివర్సిటీ విద్యార్థులు కూడా నిరూపించారని ఫిర్యాదులో తెలిపారు. తాము ఎప్పుడు, ఎక్కడెక్కడికి వెళుతున్నాం? అన్న విషయం రికార్డ్ కాకుండా వుండడం కోసం గూగుల్ తన సెట్టింగ్స్ లో 'ప్రైవసీ ఆప్షన్' ఇచ్చిందని, అయితే, దానిని ఎనేబుల్ చేసుకున్నప్పటికీ లొకేషన్ వివరాలను అది ట్రాక్ చేస్తోందని కోర్టు దృష్టికి తెచ్చాడు.

దీంతో గూగుల్ పేర్కొన్నట్టు ఇందులో ప్రైవసీ అన్నది లేదని సదరు ఫిర్యాదుదారు వాదించాడు. అయితే ఈ దావాపై స్పందించేందుకు గూగుల్‌ నిరాకరించింది. 

More Telugu News