RX 100: ‘ఆర్ఎక్స్ 100’ సినిమా బైక్ వేలం.. వివరాలు!

  • కేరళ వరదలపై స్పందించిన సినిమా యూనిట్
  • కనీస ధర రూ.50,000గా నిర్ణయం 
  • సాయం చేయాలని కోరిన హీరో కార్తికేయ

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వాడిన ఆర్ఎక్స్ 100 బైక్ కు కూడా యూత్ లో భారీ క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు వీలుగా ఈ బైక్ ను వేలం వేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.

ఈ మేరకు హీరో కార్తికేయ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తమ సినిమాలో వాడిన ఆర్ఎక్స్ 100 బైక్ ను వేలం వేస్తున్నామనీ, కనీస ధర రూ.50,000గా నిర్ణయించామనీ కార్తికేయ తెలిపాడు. బైక్ కావాలనుకునే వారు తమ వివరాలను rx100auction@gmail.com కు మెయిల్ చేయాలనీ, లేదంటే 9100445588 నంబర్ కు వాట్సప్ చేయాలని సూచించాడు.

More Telugu News