china: కస్టమర్ భోజనాన్ని రుచిచూసిన డెలివరీ బాయ్.. కొరడా ఝుళిపించిన కంపెనీ!

  • చైనాలోని గ్యాంగ్ డాంగ్ లో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఉద్యోగిపై వేటు వేసిన కంపెనీ

ఇటీవలి కాలంలో ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా భోజనం ఆర్డర్ చేయడం అన్నది మామూలు విషయం అయిపోయింది. ఎప్పుడైనా సరే ఆర్డర్ చేసేందుకు సౌలభ్యం ఉండడంతో ఈ బిజినెస్ కూడా బాగానే నడుస్తోంది. అయితే తాజాగా ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటేనే భయపడే ఘటన చైనాలో చోటుచేసుకుంది.

చైనాలోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్సులో ఓ వ్యక్తి  ‘మెయిటువాన్’ యాప్ తో భోజనం ఆర్డర్ ఇచ్చాడు. అయితే భోజనాన్ని తీసుకువచ్చిన డెలివరీ బాయ్ మాత్రం జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. లిప్ట్ లో భోజనం పార్శిల్ ను తెరిచి రుచి చూశాడు. అనంతరం మరో కవర్ తీసి దాంట్లోని డ్రింక్ ను కూడా తాగాడు. చివరికి భోజనం పార్శిల్ ను మళ్లీ నీట్ గా ప్యాక్ చేసి డెలివరి చేసేశాడు. కానీ లిఫ్ట్ లో ఉన్న సీసీటీవీలో ఈ మొత్తం వ్యవహారం రికార్డ్ అయింది. దీన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో చైనాలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజమైన వైబోలో వైరల్ గా మారింది.

ఈ ఘటన కంపెనీ దృష్టికి వెళ్లడంతో తక్షణం అతడిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లకు సేవలు అందించే విషయంలో ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది.

More Telugu News