New Zeland: ప్రసవం కోసం.. ఆసుపత్రికి సైకిల్ పై వెళ్లిన న్యూజిలాండ్ మంత్రి!

  • మహిళా, ఆరోగ్య, రవాణా శాఖల సహాయమంత్రిగా ఉన్న జూలీ ఎన్నే
  • 40 వారాల 4 రోజుల గర్భంతో సైకిలెక్కిన మంత్రి
  • నేడో, రేపో డెలివరీ

నెలలు నిండిన వేళ, న్యూజిలాండ్ కు చెందిన ఓ మంత్రి, సైకిలుపై స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పతాక శీర్షికల్లో నిలిచారు. మహిళా, ఆరోగ్య, రవాణా శాఖల సహాయమంత్రిగా ఉన్న జూలీ ఎన్నే జెంటర్, సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి డెలివరీ నిమిత్తం వెళ్లగా, ఇప్పుడామె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

జూలీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గర్భం ధరించిన 40 వారాల, నాలుగు రోజుల తరువాత సైకిలెక్కి ఆసుపత్రికి వెళ్లిన 38 ఏళ్ల జూలీ ఇప్పుడు డెలివరీ కోసం వేచి చూస్తోంది. ఆమె కనీసం మూడు వారాల మాతృత్వ సెలవు తీసుకోవాలని భావిస్తోందట. కాగా, ఈ సంవత్సరం న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్ ప్రసవించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యున్నత పదవిలో ఉండి ప్రసవించిన రెండో మహిళగా ఆమె రికార్డును సృష్టించారు కూడా.

More Telugu News